ప్రీ-ఆదరయీజేషన్

 1. ప్రీ-ఆదరయీజేషన్ కోసం వినతులు నెట్వర్క్ ఆసుపత్రుల నుంచి ట్రస్ట్ కి అందుతాయి.వైద్య నిపుణుల సహాయంతో , ట్రస్ట్ మార్గదర్శకాల కనుగుణంగా వాటిని పరిశిలించి వినతి అందిన 12 గంటలలోపు తుది ఆమోదం తెలపడం జరుగుతుంది.
 2. ప్రీ-ఆదరయీజేషన్ కోసం అసంపూర్తి వివరాలు అందిన వినతిపై పానెల్ డాక్టర్ ఒకసారి మాత్రమే ప్రశ్నించడం జరుగుతుంది.అల ఒకసారి ప్రశ్నినించిన సందర్భము లో ఆమోదానికి అదనము గ 6 గంటల సమయం తీసుకోని , 18 గంటలలో తుది ఆమోదం ఇవ్వడం జరుగుతుంది.
 3. ప్రత్యెక నిపుణత అవసరమైన కేసుల్లో సంబంధిత ప్రత్యేక డాక్టర్ల సలహాల్ని ట్రస్ట్ ఉపయోగించుకుంటుంది.
 4. కేసుల నిర్వహణ విషయమై పూర్తీ స్థాయి బాధ్యత , పానెల్ డాక్టర్ లు లేదా ట్రస్ట్ ప్రీ-ఆదరయీజేషన్ రిమార్కులు కేవలం సలహాలు గానే భావించాలి. వీటి ఆధారంగ వైద్యం ను అందించే డాక్టర్ తను ప్రతిపాదించిన విదానంలో ఎ చిన్న మార్పులు చేయకూడదు.
 5. ప్రీ-ఆదరయీజేషన్ స్థాయి లో ప్యాకేజులు ధరలలో తగింపు ను ట్రస్ట్ సిఫార్స్ చేయదు.
 6. టెలిఫోన్ ద్వారా ఆమోదం: అత్యవసర పరిస్తితులలో నెట్వర్క్ ఆసుపత్రి ప్రీ-ఆదరయీజేషన్ను టెలిఫోన్ ద్వారా పొందవచు.కేసు ఎ ఫదకం పరిధి లోకి వస్తుంది అని నిర్ణఇంచిన తదుపరి మాత్రమే టెలిఫోన్ ద్వారా ప్రీ-ఆదరయీజేషన్ ఇవ్వడం జరుగుతుంది. టెలిఫోన్ ద్వారా పొందిన ప్రీ-ఆదరయీజేషన్ తాత్కాలిక ఆమోదం గ మాత్రమే భావించాలి. రెగ్యులర్ ప్రీ-ఆదరయీజేషన్ కు 24 గంటల లోపున సాధారణ పద్దతులలో ప్రీ-ఆదరయీజేషన్ పొందాలి.
 7. ట్రస్ట్ ద్వారా ముందు అధికారం తిరస్కరణ వల్ల , ట్రస్ట్ ద్వారా రోగికి చికిత్సకు ఆటంకాలు ఉండదు. ముందు అధికారం తిరస్కరణ కేవలం రోగి మరియు చికిత్స ఎంపికలు యొక్క వ్యాధి పేర్కొన్న చికిత్సలలో లేవు అని అర్థం.

24 గంటల ప్రీ-ఆదరయీజేషన్

 1. ప్రస్తుతం అమలులో వున్న ఆన్లైన్ ప్రీ-ఆదరయీజేషన్ వర్క్ ఫ్లో ప్రకారం మాత్రమే ప్రీ-ఆదరయీజేషన్ను నిర్వహించడం జరుగుతుంది. పధకం లో అదనంగా ప్రీ-ఆదరయీజేషన్లోడ్ ను నిర్వహించేందుకు వీలుగా ట్రస్ట్ ఐ. టి మౌలిక సదుపాయాలని కలిపించాల్సి వుంటుంది.
 2. సంవత్సరములోని 365 రోజులు , 24 గంటలూ ప్రీ- లు ఆమోదించబడతాయి

పథకం టెక్నికల్ కమిటీ

పథకం సాంకేతిక కమిటీ అని పిలవబడే ఒక కమిటీ సి ఈ ఓ కు సిఫార్సు చేసేందుకు క్రింది అధికారాలను ఉంటుంది:

 1. ప్రీ-ఆదరయీజేషన్ ల విషయములో భేదాబిప్రయం ఏర్పడినపుడు తుది నిర్ణయం చేయటం.
 2. బఫర్ అమౌంట్ వినియోగనికి అనుమతించటం.
 3. ప్యాకేజిలోని ధరలు పెంపును అనుమతించటం లేదా జాబితా లో లేని చికిత్సలకు ధర నిర్ణఇంచి బఫర్ అమౌంట్ నుంచి చెల్లించటం.
 4. మందులు పరిభాషను సవరించటం , జాబితా లో లేని చికిత్సలను వరుస క్రమంలో మార్చటం.
 5. జాబితా లోని చికిత్సల నియమావళిలో స్వల్ప మార్పులు చేయటం.
 6. మోరల్ హజార్డ్ ను తగించేందుకు వీలుగా కేసుల ఎంపిక లో సహకరించే మార్గదర్శకాలు రూపొందించటం.

పథకం టెక్నికల్ కమిటీ ఏర్పాటు

పథకం సాంకేతిక కమిటి దిగువ పేర్కొన్న సభ్యులతో ఏర్పడుతుంది:

 1. కార్యనిర్వాహక అధికారి (సాంకేతికము)
 2. సంయుక్త కార్యనిర్వాహక అధికారి (సాంకేతికము)
 3. ప్రభుత్వం నియమించిన వైద్యుడు