A.శాఖధిపతులకు వివిధ దశలు

  1. వ దశ : ఉద్యోగాల వివరాలు అందించడం.
    1. ఇ.హెచ్.యఫ్ పనుల కోసం కంప్యుటర్ పరిజ్ఞానం వున్న ఒకరిని నోడల్ అధికారిగా నియమించాలి.
    2. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిఒక శాఖలోని డి.డి.ఒ.ల వారీగా ఖచ్చితమైన వివరాలు రాబట్టేందుకు నమూనాలు సిద్దం చేయడం జరిగింది. వివరాల కోసం పట్టిక 2 ను చుడండి.
    3. జిల్లాస్థాయిలో డి.డి.ఒ.లవారీగా ఉద్యోగాల జాబితాను తయారు చేయాలి. మీ శాఖకు చెందిన అన్ని మంజూరయిన ఉద్యోగాల వివరాలను పట్టికలు 5 మరియు 1 లలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్కు అందచేయాలి.
    4. హెచ్.ర్.ఎం.ఎస్ - ఈ.ఎస్. దరఖాస్తులో 'అడ్మినిస్త్రేటర్' లాగిన్ అయి ఉద్యోగుల సంఖ్య మార్పులను అప్ డేట్ చేయాలి. (కొత్తగా మంజురయిన ఉద్యోగాలు, మంజూరు జాబితా నుండి తొలగించిన ఉద్యోగాలు)
  2. వ దశ: ఆధార్ ఎన్రోల్మెంట్ పొందడానికి ఉద్యోగులను సమాయుత్తం చేయాలి.
    1. డి.డి.ఒ / ఎస్.టీ.ఒ. / ఎ.పి.పి.ఒ/లను లక్ష్యాలు నిర్దేశించాలి
    2. సెప్టెంబర్ 30 వ తేది 2012 నాటికి ఆధార్ లో అందరు ఉద్యోగుల, పెన్షనరుల ఎన్రోల్మెంట్ పూర్తిచేయాలి.
  3. వ దశ:దరఖాస్తుల ఆమోదాన్ని పర్యవేక్షణ
    1. దరఖాస్తులను సమర్పనకు డి.డి.ఒ/ఎస్.టి.ఒ/ఎ.పి.పి.ఒ లకు లక్ష్యాలు నిర్దేశించాలి.
    2. అక్టోబరు 20 లోపున నూరు శాతం దరఖాస్తుల సమర్పణ లక్ష్యాలని సాదించాలి.
    3. డి.డి.ఒ. స్థాయిలో ఉద్యోగుల పెండింగ్ దరఖాస్తుల ఆమోదం పర్యవేక్షించడం. రాష్ట్ర వ్యాప్తంగా డి.డి.ఒ ల స్థాయిలో దరఖాస్తుల ఆమోదంలో నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవడంలో ఏరోజైన పేన్డేన్సి లేకుండా చూడాలి
    4. అక్టోబరు 25 లోపల డి.డి.ఒ/ఎస్.టి.ఒ/ఎ.పి.పి.ఒ ల వారీగా దరఖాస్తులు నూరు శాతం ఆమోదంపొందేలా చూడాలి.

B.డైరేక్టర్ ట్రెజరీస్ మరియు అకౌంట్స్ / పి.ఏ.ఒ.ల కోసం వివిధ దశలు

  1. వ దశ : వివరాల అందజేత
    1. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తో సమన్వయానికి ఒకరిని నోడల్ అధికారిగా నియమించాలి.
    2. ఉద్యోగులు, పెన్షనరుల జాబితా వారి కోడ్ల తొ పాటు, అందుబాటులో వున్న సమాచారం అంతటిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కి అందచేయాలి.
    3. డి.డి.ఒ.లు, వారి కోడ్లు, కార్యాలయాల పేర్లు, మొదలైన అందుబాటులోని సమాచారం అంతటిని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు అందచేయాలి. ఒక ఉద్యోగి ఇ-ఫాం పూర్తి చేయనప్పుడు అతని ఉద్యోగం పేరులు సెలెక్ట్ చేసే సమయంలో ఈ సమాచారాన్ని వినియోగించడం జరుగుతుంది
    4. శాఖాధిపతి కిందవున్న మంజురైన ఉద్యోగాల జాబితా డి.డి.ఒ ల వారీగా అందచేయాలి.
    5. డైరేక్టర్ ట్రెజరీస్, హెచ్.ర్.ఎం.ఎస్ లో అందుబాటులో వున్న అప్ డేట్ చేసిన డేటాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు అందచేయాలి.
  2. వ దశ:పెన్షనరుల దరఖాస్తుల ఆమోదం పర్యవేక్షణ
    1. ఎస్.టి.ఒ/ఎ.పి.పి.ఒ. లు పెండింగ్లో వున్న పెన్షనరుల దరఖాస్తులను పర్యవేక్షించాలి. రోజువారి పెన్దేన్సి లేకుండా

C.పౌరసరఫరాల శాఖ కమీషనర్ / కార్య ఇన్ఫర్మేషన్ టెక్నోలోజి

  1. వ దశ :ఆధార్ సెంటర్ల ప్రారంబించడం
    1. ఆధార్ నమోదు విషయం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ , జిల్లా కలెక్టర్ తో సమన్వయపరచేందుకు ఒక నోడల్ అధికారిని నియమించాలి.
    2. ఉద్యోగులు, పెన్షనరుల, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఎన్రోల్ చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన ఆధార్ సెంటర్ల ప్రాంతాల జాబితాను జిల్లా కలెక్టర్ నుంచి పొందాలి
    3. అక్టోబరు 20 వ తేదీలోపు ఉద్యోగులు, పెన్షనరులు ఆధార్ నమోదు కార్యక్రమం పూర్తయ్యేందుకు ఒక షెడ్యుల్ రూపొందించాలి.
    4. సూచించిన అన్ని ప్రాంతాలు ఆధార్ కేంద్రాలు వెంటనే తెరవాలి.
    5. ఆధార్ లబ్దిదారులను ఎన్రోల్ చేయాలి.
  2. వ దశ:ఆధార్ డేటా బదలాయింపు
    1. రాష్ట్రంలో ఆధార్ సెంటర్ ల ఏర్పాటు డేటాను ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు అందచేయాలి.
    2. ఎన్రోల్ చేసిన ఉద్యోగులు/ పెన్షనరులు వేలిముద్రల గుర్తులు, ఫోటోలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కు అందించాలి.
  3. వ దశ: డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలి.
    1. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ డేటా సెంటర్ ఏర్పాటుకు దోహదపడేలా ప్రత్యేక డేటా సెంటర్ (ఎస్.డి.సి) వద్ద అవసరమైన ఏర్పాటు చేయాలి.

D.జిల్లా కలెక్టరుకు వివిధ దశలు:

  1. వ దశ: ఆధార్ ద్వారా ఎన్రోల్ చేయడం
    1. ఉద్యోగులకు /పెన్షనరులకు సౌకర్యంగా ఉండేలా ఆధార్ సెంటర్ ఏర్పాటుకు సరైన ప్రాంతాలు గుర్తించాలి
    2. అందరు ఉద్యోగులు/పెన్షనరులు ఆధార్లో ఎన్రోల్ అయ్యేలా సమాయుత్తం చేయాలి.
  2. వ దశ: దరఖాస్తుల ఆమోదం పొందేలా చూడడం
    1. హెచ్.ఆర్.ఎం.ఎస్ - ఇ.ఎస్ క్రింద దరఖాస్తులు సమర్పించేందుకు ఉద్యోగులు /పెన్షనరులను ప్రోత్సహించాలి
    2. ఉద్యోగులు, పెన్షనరులు దరఖాస్తులు సమర్పించడాన్ని పర్యవేక్షించాలి.
    3. డి.డి.ఒ స్థాయిలో ఆమోదానికి ఫై పెండింగ్ లో వున్న దరఖాస్తులను మోనిటర్ చేయాలి.జిల్లా స్థాయిలో ఏరోజైన, రోజువారి పని ముగిసే సమయానికి దరఖాస్తుల ఆమోదం పెండింగ్ లేకుండా చూడాలి.
    4. ఎస్.టి.ఒ/పి.సి.ఒ ల వద్ద పెన్షనరుల దరఖాస్తులు ఆమోదం కోసం పెండింగ్లో లేకుండా చూడాలి. ఏరోజైన పనిముగిసే నాటికి ఎస్.టి.ఒ/పి.సి.ఒ ల వద్ద ఆమోదం కోసం పెన్షనరుల దరఖాస్తులు పెండింగ్ లో లేకుండా చూడాలి.
  3. వ దశ:ఆరోగ్య కార్డు ల జారీ
    1. ఆరోగ్యశ్రీ గుర్తించిన కార్డుల అమ్మకందారు, ఆరోగ్య కార్డుల కేంద్రాల ఏర్పాటుకు ప్రాంతాలను గుర్తించాలి.
    2. విద్యుత్ కనెక్షన్ ఉన్న, భద్రత కలిగిన ప్రదేశాన్ని కేటాయించాలి
    3. లబ్దిదర్లకు ప్రింట్ చేసిన ఆరోగ్య కార్డ్లు జారిచేసేందుకు షెడ్యుల్ తయారు చేయాలి. అందరు లబ్దిదర్లకు ఒకే రోజున పిలవకుండా జాగ్రత్త వహించాలి.
    4. కార్డు జారి లబ్దిదార్లన్దరికి ఆన్ లైన్ విధానంలో అమ్మకదరుల కార్డు జారీ చేయడానికి సహకరించాలి
  4. వ దశ:మోనిటర్ చేసే విధానం
    1. పూర్తిస్థాయి సమన్వయానికి ఒక నోడల్ అధికారిని నియమించాలి.
    2. జిల్లాస్థాయిలో అన్ని శాఖల జిల్లా అధికారులు, జిల్లా ఖజానా అధికారి, పే అండ్ అకౌన్ట్స్ అధికారి యితర అవసరమైన సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకోవాలి.
    3. అక్టోబరు 20 నాటికి ఆధార్ ఎన్రోల్మెంట్ పూర్తిచేయాలి.
    4. అక్టోబరు 25 నాటికి అందరు డి.డి.ఒ.లు హెచ్.ఆర్.ఎం.ఎస్.-ఇ.ఎస్ క్రింద దరఖాస్తుల సమర్పణ నూరు శాతం పూర్తయ్యేలా చూడాలి
    5. అక్టోబరు 30 నాటికి అందరు డి.డి.ఒ దరఖాస్తులు ఆమోదం పూర్తి చేసేలా చూడాలి