తరచుగా అడిగే ప్రశ్నలు

Click here to Print FAQs

అర్హత

  • ఇహెచ్‌ఎస్‌ అంటే ఏమిటి?
    • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అటెండెన్స్‌ రూల్స్‌, 1972' క్రింద ప్రస్తుతం వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌ క్రింద నమోదయిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా నగదు రహిత చికిత్సలను అందించేందుకు ఉద్దేశించినది ఉద్యోగుల ఆరోగ్య పథకం. (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ - ఇహెచ్‌ఎస్‌). 5 డిసెంబర్‌ 2013వ తేదీన ప్రారంభించిన ఈ పథకాన్ని జి.ఓ. ఎంఎస్‌. నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేటెడ్‌ 29.10.2014 ప్రకారం మార్పులతో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతోంది.
      జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.ehf.gov.in వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
  • ఎవరు అర్హులు?
    • ఎ)ఎఫ్‌ఆర్‌లో నిర్వచించిన అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొవిన్షియలైజ్డ్‌ వర్క్‌ ఛార్జ్‌డ్‌ ఉద్యోగులతో సహా
      బి) స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్‌ ఉద్యోగులు
      సి) అందరు సర్వీస్‌ పింఛనుదారులు
      డి)కుటుంబ పింఛనుదారులు
      ఇ) తిరిగి ఉద్యోగం పొందిన సర్వీసు పింఛనుదారులు
  • ఎవరు అర్హులు కాదు?
    • ఎ)సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వేలు, ఆర్‌టిసి, పోలీసు శాఖకు చెందిన ఆరోగ్య భద్రత, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖకు చెందిన ఆరోగ్య సహాయతల వంటి ఇతర బీమా పథకాలు వర్తించే వారు
      బి) లా ఆఫీసర్స్‌ (అడ్వొకేట్‌ జనరల్‌, స్టేట్‌ ప్రాసిక్యూటర్స్‌, స్టేట్‌ కౌన్సెల్స్‌, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రొసిక్యూటర్లు
      సి) క్యాజువల్‌, దినసరి వేతనంపై పనిచేసే కార్మికులు
      డి) దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు జీవించివుండగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు
      ఇ) AIS officers and AIS pensioners and
      జి) జ్యుడిషియల్‌ అధికారులు
  • కుటుంబ సభ్యులు అంటే ఎవరు?
    • ఎ) భార్య లేదా భర్త
      బి) పూర్తిగా ఆధారపడిన పిల్లలు (దత్తత తీసుకొన్న పిల్లలతో సహా)
      సి) పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత తీసుకొన్న లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు; కాని ఇద్దరికీ కాదు)
      డి) సర్వీసు పింఛనుదారుల తరహాలోనే కుటుంబ పింఛనుదారులపై ఆధారపడిన వారు కూడ అర్హులు
  • ఆధారపడటం అంటే?
    • ఎ) తమ జీవనోపాధి కోసం పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు
      బి) నిరుద్యోగులైన కుమార్తెల విషయంలో వారు అవివాహితులు లేదా వైధవ్యం పొందిన వారు లేదా విడాకులు తీసుకొన్న వారు లేదా వదిలిపెట్టబడిన వారు (వయస్సు పరిమితి ఆంక్షలు లేవు) అయి వుండాలి.
      సి) నిరుద్యోగులైన కుమారులు 25 సంవత్సరాల లోపు వయస్సు వారై వుండాలి
      డి) వికలాంగులైన పిల్లల విషయంలో ఆ వైకల్యం వారి ఉపాధికి అవరోధంగా వుండాలి.
  • న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్లీడర్లు, స్టాండింగ్‌ కౌన్సెల్స్‌ అర్హులా?
    • కాదు, లా ఆఫీసర్లు, జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు ఈ పథకం వర్తించదు.
  • ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?
    • ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.
  • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
    • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.
  • ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?
    • కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.
  • సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?
    • అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.
  • దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
    • అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.
  • నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?
    • కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
  • భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?
    • అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.
  • ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?
    • కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.
  • రాష్ట్రం వెలుపల నివసిస్తున్న పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయా?
    • ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.

నమోదు

పరిధి

  • పథకంలో వర్తించే ప్రయోజనాలు ఏమిటి?
    • 1. ఇన్‌ పేషెంట్‌ చికిత్స:
      · అన్ని ఎంపానెల్డ్‌ ఆసుపత్రులలో అన్ని స్పెషాలిటీల క్రింద పేర్కొన్న చికిత్సలు అందుతాయి. జాబితాను www.ehf.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు
      · శస్త్రచికిత్స లేదా వైద్య చికిత్సల ఫాలో అప్‌
      · వ్యాధి నిర్థారణ పరీక్షలు, ఔషధాలు, ఇంప్లాంట్‌లు, కన్స్యూమబుల్స్‌, ఆహారం, ఆపరేషన్‌ / చికిత్స తర్వాత పరిణామాలు, ఫాలో అప్‌ కేర్‌ వంటి వన్నీ ప్యాకేజీలో భాగంగా వుంటాయి.
      · చివరకు ఐపి ట్రీట్‌మెంట్‌కు దారి తీయని కన్సల్టేషన్‌లు, ఇన్వెస్టిగేషన్‌లతో సహా రోగుల ప్రీ ఇవాల్యుయేషన్‌ కూడ ప్యాకేజీలో భాగంగా వుంటుంది.
      2) దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్‌ పేషంట్‌ చికిత్స:
      · నోటిఫై చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో దీర్ఘకాలిక వ్యాధులకు కన్సల్టేషన్‌, ఇన్వెస్టిగేషన్‌, డ్రగ్స్‌తో సహా చికిత్స వుంటుంది. పూర్తి మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో వుంచటం జరుగుతుంది.
      3) వార్షిక ఆరోగ్య పరీక్షలు:
      · 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులకు .
  • ఆర్థిక వర్తింపు ఎంత వుంటుంది?
    • ఇహెచ్‌ఎస్‌లో ఎపిసోడ్‌ల సంఖ్యకు పరిమితి ఏదీ లేకుండా, అనారోగ్యపు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షల ఆర్థిక పరిమితి వుంటుంది. చికిత్స వ్యయం ఈ పరిధిని మించినప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను కొనసాగిస్తాయి. ముందుగా నిర్థారించిన ప్యాకేజీ రేట్లు రూ.2 లక్షలకు మించివున్నప్పుడు ఈ పరిమితి వర్తించదు.
  • ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వెలుపల తీసుకొనే చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందా?
    • 01.12.2014 నుంచి ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల వెలుపల తీసుకొనే చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ను అనుమతించటం జరగదు.
  • ఆరోగ్యశ్రీ పథకానికి, ఉద్యోగుల ఆరోగ్య పథకానికీ సదుపాయాలు, ఆర్థిక పరిమితుల విషయంలో వ్యత్యాసం ఏమిటి?
    • గతంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పేరును 'డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవ'గా మార్చటం జరిగింది. దారిద్య్ర రేఖకు దిగువన వున్న (బిపిఎల్‌) కుటుంబాలకు కుటుంబం మొత్తానికి సంవత్సరానికి రూ.2.5 లక్షల పరిమితితో, 1038 ప్రొసీజర్స్‌తో ఫ్లోటర్‌ బేసిస్‌లో ఈ పథకం వర్తిస్తుంది. రోగికి ఇన్‌పేషంట్‌ చికిత్సలు జనరల్‌ వార్డులో మాత్రమే లభ్యమవుతాయి. ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో మాత్రమే చికిత్స అందించేలా 133 ప్రొసీజర్స్‌ను పేర్కొనటం జరిగింది.
      అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ (ప్రభుత్వ మరియు ప్రైవేటు)లలో ఎపిసోడ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.00 లక్షల పరిమితితో నగదు చెల్లింపు లేకుండా చికిత్స అందించేందుకు ఉద్ధేశించినది ఉద్యోగి ఆరోగ్య పథకం. చికిత్స వ్యయం ఒకవేళ రూ.2 లక్షలకు మించినప్పటికీ, నెట్‌వర్క్‌ ఆసుపత్రి సేవలను నిరాకరించకుండా నగదు రహిత చికిత్సను కొనసాగిస్తుంది. ప్రస్తుతం 1885 ప్రొసీజర్స్‌ / థెరపీలకు సంబంధించి, సెమీ ప్రైవేట్‌, ప్రైవేట్‌ వార్డులలో అర్హతకు అనుగుణంగా చికిత్స అందించటం జరుగుతుంది. నోటిఫైడ్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో దీర్ఘకాలిక ఓపి వ్యాధులచికిత్స, 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలకు కూడ ఈ పథకం వర్తిస్తుంది.
  • ఉద్యోగుల ఆరోగ్య పథకం ఔట్‌ పేషంట్‌ చికిత్సకు వర్తిస్తుందా?
    • దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే ఔట్‌ పేషంట్‌ చికిత్స నోటిఫైడ్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో లభిస్తుంది. వారం రోజుల పాటు మధ్యాహ్నం 2 - 4 గంటల మధ్య, స్పెషల్‌ క్లినిక్‌లలో కన్సల్టెంట్‌ డాక్టర్‌ రోగులను పరీక్షిస్తారు. శాంపుల్‌ కలెక్షన్‌తో క్లినికల్‌ లాబొరేటరీ సేవలు, ఫార్మసిస్ట్‌, రేడియోలజీ, అందుబాటులో వుంటాయి. కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం స్పెషల్‌ క్లినిక్‌లలో ఔషధాలను రోగికి పంపిణీ చేయటం జరుగుతుంది.
  • ఒకవేళ నేను ఆసుపత్రికి చెల్లింపు చేయవలసి వస్తే, దానిని తిరిగి పొందవచ్చా?
    • జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేట్‌ 29.10.2014 ప్రకారం ఉద్యోగులు / పింఛనుదారుల జీతం / పింఛను నుంచి పథకం నిమిత్తం చందా మొత్తాలను 01.12.2014వ తేదీన చెల్లింపు చేసే నవంబర్‌ 2014 జీతాలు / పింఛను మొదలు మినహాయించటం మొదలవుతుంది. ఎపిఐఎంఎ నియమాలు, 1972 ప్రకారం మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను 01.12.2014 తర్వాత తీసుకొనే చికిత్సలకు అనుమతించటం జరగదు.

ఆసుపత్రులు