ఉద్యోగులు లాగిన్అయ్యేందుకు సూచనలు

ప్రభుత్యవము సమగ్ర ఆర్ధిక నిర్వహాణ వ్యవస్థను కొనసాగిస్తున్నది. ఈ ప్రక్రియ అన్ని ప్ర భుత్వ విభాగాలలో బడ్జెట్ తయారీ, నిధుల విడుదల, ఖర్చులు, డిడిఓలు మరియు ఎలక్రానిక్ డేటా నిర్వహణ మెదలయిన పద్ధతులను ఆటోమేటైజేషన్ చేసేందుకు ఉపయుక్తమవుతుంది. మానవ వనరుల నిర్వహణా వ్యవస్థ (HRMS) కుడా ఈ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంది. హచ్.ఆర్.మ్.ఎస్ ప్రక్రియ ఉద్యోగులకు అందవలసిన ఆర్ధిక మరియు ఆర్దికేతరవ్యవహరాలకు సంబంధించిన అంశాలు కుడా ప్రాసెస్ అవుతాయి. జి.వో.మ్.ఎస్.నెం.౩౩4, ఫైనాన్స్ (ఎస్.మ్.పి.సి-II) డిపార్టమెంట్, తే.13.2.2013 ద్వారా ఆర్ధిక శాఖ పోర్టల్లో వెబ్ బేస్డ్ అప్లికేషను వినియోగించి ప్రభుత్వ ఉద్యోగులందరి వివరాలను సేకరించాలని రాష్ట్రములోని డిడివో లందరకు ఉత్తర్వులను జారీ చేసింది.

ఈ విధంగా డిడివోలు సమర్పించిన సమాచారము, ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంభ సభ్యులకు హెల్త్ కార్డులను జారిచేయడానికి వీలుగా ఆర్ధిక శాఖ ద్వార డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవా ట్రస్ట్ అందుబాటులోకి వస్తాయి.

ఈ వివరాలను పరిశీలించే సందర్భంలో కొందరు ఉద్యోగులు వారి ఫోటోలను మరియు వారిపై ఆధారపడిన కుటుంబసబ్యుల ఫోటోలను అప్ లోడ్ చేయని విషయం గమనించడమైనది. అటువంటి ఉద్యోగులు www.ehf.gov.in అనే వెబ్ పోర్టల్ ద్వారా లాగిన్ అయ్యి తమ ఎంప్లాయి ఐ.డిని (employee ID) యూజర్ ఐ.డి.ని మొదటిసారి పాస్ వర్డ్ గా వినియోగిస్తూ ఫోటోలను అప్లోడ్ చేసుకోవచ్చును.

ఈ ప్రక్రియలో ఉద్యోగులు, తమపై ఆధారపడిన కుటుంబ సభ్యుల వివరాలను కూడా అప్ డేట్ చేసే వీలు కలదు. ఇందుకు అనుసరించ వలసిన విధానం ఈ క్రింద ఇవ్వబడినది.

ఆధారపడిన కుటుంబసభ్యులు

  1. ఫొటో: 45135 మిల్లీమీటర్ల కొలతతో (ఐసిఎవో తరహ) పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోను జతచేయండి. ఇది 20౦ కె.బి కంటే తక్కువ సైజుండాలి.
  2. ఉద్యోగి జీవిత భాగస్వామి కూడా రాష్ట్ర ప్రభుత్వోద్యోగి లేదా సర్వీస్ పించను పొందుతున్న వారైతే దరఖాస్తులోని నిర్ణీత ప్రదేశంలో ఆ వివరాలను నమోదు చేయాలి.
  3. జనన ధృవీకరణ సర్టిఫికెట్‌: ఐదేళ్ళ లోపు వయసున్న కుటుంబసభ్యులున్నట్లయితే వారి జనన ధృవీకరణ సర్టిఫికెట్లను స్కాన్‌చేయండి.
  4. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అంగవైకల్యం వున్నట్లయితే వికలాంగ ధృవీకరణ పత్రాన్ని స్కాన్‌చేయండి.

ఆరోగ్యకార్డులు

  • లబ్దిదారులకు ఈ పధకం ప్రయోజనాలు వెంటనే అందేందుకు అనుగుణంగా, అర్హులయినవారికి తాత్కాలిక ఆరోగ్యకార్డులను జారి చేయడం జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా సమర్పించబడిన దరఖాస్తులను డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవా ట్రస్ట్ పరిశీలన పూర్తికాగానే లబ్దిదారుల లాగిన్లలోనే ఒక తాత్కాలిక ఆరోగ్యకార్డును జతచేయడం జరుగుతుంది. ఇంటర్నెట్ సాయంతో లబ్దిదారులు ఈ డిజిటల్ కార్డులను పొంది. వాటిని ప్రింట్ తీసుకొని, లామినేషన్ చేయించుకుని తాత్కాలికంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే, మీసేవ కేంద్రాల్లో (డైరెక్టర్, ఇఎష్ డి, ఐటి&సి పేర్కొన్న ప్రకారం) రు.25కి మించకుండా రుసుము చెల్లించి కూడా ఈ తాత్కాలిక ఆరోగ్యకార్డులను పొందవచ్చు.
  • తాత్కాలిక ఆరోగ్యకార్డును పొందినవారందరూ ఎంపిక చేయబడిన ఆసుపత్రుల్లో చికిత్సలు పొందేందుకు అర్హులు. ఈ కార్డు వుంటే ఈ ఆసుపత్రుల్లో చికిత్సను వెంటనే ప్రారంభిస్తారు. డాక్టర్ ఎన్ టి ఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఎంపిక చేసిన ఆసుపత్రుల వివరాలను www.ehf.gov.in వెబ్ సైట్ లో గమనించవచ్చు.