డి.డి.ఓ.సూచనలు

 1. ఒకటవ దశ :- దరకాస్తు చేయు విదానం
  1. ఉద్యోగి లేదా పెన్షనర్ చేయు సమక్షంలో యూజర్ గుర్తింపు కోడ్ ద్వారా లాగిన్ అవ్వండి
  2. కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఉద్యోగి లేదా పెన్షనర్ తరపున దరఖాస్తును సమర్పించండి. ఉద్యోగి లేదా పెన్షనర్ సమక్షంలో అవసరమైన డేటాను దరకాస్తులో పొందుపరచండి. అనవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయండి..
 2. రెండోవ దశ :- దరకస్తుల ఆమోదం.
  1. డి.డి ఓ యూజేర్ ఐడి పాస్ వర్డ్ ను వినియోగించి లాగిన్ అవ్వాలి.
  2. ఉద్యోగి, పెన్షనర్ దరకాస్తులో పొందుపంచిన సమాచారాన్ని ఆధార వివరాలు , సర్వీసు రిజిస్టర్ వివరాలతో సరి చూసి దరకాస్తును పరిశీలించాలి.
  3. స్వల్ప తేడాలు వుంటే వాటిని సరిచేయాలి.
  4. ఎకువ దోషాలు వుంటే దరకాస్తును సరియైన కారణాలు చూపుతూ తిరస్కరించాలి.
  5. పూర్తి స్థాయి పరిశీలన తరవాత మాత్రమే దరకాస్తు ఆమోదించాలి . అధీకృతం కానీ వ్యక్తులు ఉద్యోగులు పెన్షనర్లుగా నమోదు అయితే దానికి బాద్యత డి.డి.ఓ. వహించాలని గమనించాలి.
  6. సబ్ ట్రేజరి అధికారి సహాయ పెన్షన్ పేమెంట్ అధికారి పెన్షనర్లకు డి.డి.ఓ గా వ్యవహరిస్తారు. సంబంధిత ఐ.టి. పొర్టల్ లో అవసరమైన చేర్పులు ఎస్.టి.ఓ. లేదా ఎ.పి.పి.ఓ లు చేయాలి.
 3. మూడోవ దశ :- ఉద్యోగుల డేటాను పొందడం.(ఎన్ రోల్ మెంట్ ప్రారంభానికి ముందు)
  1. మంజూరైనా ఉద్యోగుల సంఖ్యలో పాటు మీ కార్యాలయంలో ఉన్న అన్ని విభాగాలు ఉద్యోగాలు జాబితా రూపొందించాలి.
  2. పట్టిక సంక్య 5 లో పేర్కొన్న సమాచారాన్ని మీ జిల్లా అధికారికి అందచేయాలి.